LOADING...
Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు
అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు

Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కి సంబంధించిన ఎంవోయూ (Memorandum of Understanding)ను రాష్ట్ర ప్రభుత్వం ర్యాటిఫై చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రముఖ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అవి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS), ఎలార్సన్ అండ్ టుబ్రో (L\&T), ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్‌ (IBM). ఈ క్వాంటం టెక్నాలజీ పార్క్‌లో ఐబీఎం సంస్థ 156 క్యూబిట్‌ సామర్థ్యంతో కూడిన 'క్వాంటం సిస్టమ్-2'ను ఏర్పాటు చేయనుంది.

Details

అమరావతిలో అత్యాధునిక సాంకేతికత

ఇక టీసీఎస్ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ సేవలు, పరిష్కారాలు, క్వాంటం రంగంలో పరిశోధనతో పాటు హైబ్రిడ్ కంప్యూటింగ్ వ్యూహాలను అందించనుంది. క్లయింట్ నెట్‌వర్క్ నిర్వహణ, స్టార్టప్‌ల మద్దతు కోసం అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఎల్‌అండ్‌టీ అందించనుంది. ఈ భారీ టెక్నాలజీ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన లక్ష్యమైన తేదీగా 2026 జనవరి 1ను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌తో అమరావతిలో అత్యాధునిక సాంకేతికత కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని అంచనా.