LOADING...
Indian Railway: రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్
రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

Indian Railway: రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 18, 2026
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది. గాజియాబాద్‌-సీతాపూర్ మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాజమండ్రి-విశాఖపట్నం మధ్య రెండు అదనపు రైల్వే లైన్ల ఏర్పాటుకు రూ.9,889 కోట్లతో అనుమతి లభించింది. నిడదవోలు-దువ్వాడ మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. ఇక గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రధాన పథకానికి కూడా విస్తరణ లభించింది. పీఎం గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికోసం రూ.83,977 కోట్లతో పీఎం గ్రామీణ సడక్ యోజన-3కు ఆమోదం తెలిపింది.

Advertisement