NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MLC Kavitha: గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి
    తదుపరి వార్తా కథనం
    MLC Kavitha: గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి
    గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి

    MLC Kavitha: గ్రూప్-1 అభ్యర్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 16, 2025
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (TSPSC) నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

    పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు తన దృష్టికి తెచ్చారని ఆమె తెలిపారు.

    ట్రాన్స్‌లేషన్ సమస్య కారణంగా ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సరిగా మూల్యాంకనం చేయలేకపోయారని, దీనివల్ల మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కవిత వెల్లడించారు.

    Details

    హాల్‌ టికెట్‌ నంబర్ల మార్పుతో అనుమానాలు

    అదేవిధంగా, గ్రూప్-1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి ఒక హాల్‌టికెట్‌ నంబర్, మెయిన్స్‌కి మరో హాల్‌టికెట్‌ నంబర్ కేటాయించడం అభ్యర్థుల్లో అనుమానాలకు దారితీసిందని ఆమె పేర్కొన్నారు.

    ఇటీవల TSPSC విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో దాదాపు 13,000 మంది అభ్యర్థుల ఫలితాలను ప్రకటించలేదని, ఏ కారణంతో వారిని ఇన్వాలీడ్‌గా ప్రకటించారో వెల్లడించాల్సిన అవసరం ఉందని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారని కవిత తెలిపారు.

    గ్రూప్ పరీక్షల్లో అవకతవకలపై ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసి చర్చించారు.

    తమ అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని అభ్యర్థులు ఆమెను కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత
    బీఆర్ఎస్

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    కల్వకుంట్ల కవిత

    MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు  భారతదేశం
    MLC Kavitha: లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ  భారతదేశం
    కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ ఆధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Kavitha: ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత తాజా వార్తలు

    బీఆర్ఎస్

    Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే  కాంగ్రెస్
    CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    PM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు తెలంగాణ
    Voter Slip :ఓటర్ స్లిప్ కావాలా..ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025