తదుపరి వార్తా కథనం

TG High Court: గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 09, 2025
11:05 am
ఈ వార్తాకథనం ఏంటి
గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ, వాటిని మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు, గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. తిరిగి మెయిన్స్ పరీక్షలను నిర్వహించి, నూతన మెరిట్ లిస్టును సిద్ధం చేయాలని టీజీపీఎస్‌సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.