Page Loader
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

వ్రాసిన వారు Stalin
Sep 23, 2023
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్షకు హాజరైన కొందరు గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ల ఆధారంగా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. బయోమెట్రిక్‌లను ధృవీకరించడం వంటి అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకోవడంలో టీఎస్‌పీఎస్‌సీ అధికారులు విఫలమయ్యారని పిటిషనర్లు ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, క్రిమినల్ కేసుల నమోదు ఆరోపణల నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే రద్దు చేసింది. ఇప్పుడు రెండోసారి పరీక్ష రద్దు కావడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్రూప్-1 పరీక్ష రద్దు కావడం ఇది రెండోసారి