LOADING...
TSGENCO: జెన్‌కోకు షాక్‌ .. బొగ్గుపై13 శాతం పెరగనున్న జీఎస్టీ 
జెన్‌కోకు షాక్‌ .. బొగ్గుపై13 శాతం పెరగనున్న జీఎస్టీ

TSGENCO: జెన్‌కోకు షాక్‌ .. బొగ్గుపై13 శాతం పెరగనున్న జీఎస్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటికే విద్యుత్ వినియోగదారులపై పెరుగుతున్న వ్యయభారం,జీఎస్టీ కొత్త నిర్ణయంతో మరింత ప్రభావం చూపనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయ ప్రకారం,విద్యుత్ ఉత్పత్తి కోసం వాడే బొగ్గుపై ఇప్పటి వరకు 5% జీఎస్టీ వడ్డీ వర్తించగా,నూతన శ్లాబుల అమలుతో ఇది 18%కి పెరుగుతోంది. అదనంగా 13% జీఎస్టీ భారంతో, ప్రతి టన్ను బొగ్గుపై సుమారు రూ.630 పెంపు చెల్లించాల్సివస్తోంది. ప్రధానంగా,జెన్‌కో వంటి ప్రభుత్వ రంగ సంస్థతో పాటు ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్నాయి. అయితే, కొత్త జీఎస్టీ విధానం కారణంగా ఈ సంస్థలుపై పడే భారాన్ని విద్యుత్‌ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. పెరిగే భారం ఎంత అనేది అధికారులు లెక్కగట్టాల్సి ఉంది.

వివరాలు 

రూ.300 కోట్లకు పైగా అదనపు భారం 

ఈ మొత్తానికి చార్జీలు పెంచుకునేందుకు విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత పెరిగిన ఖర్చును సంస్థలు వార్షిక ఆదాయ, అవసర నివేదికల్లో పొందుపరిచి టీజీఈఆర్‌సీ ఆమోదం పొందిన తర్వాత కొత్త విద్యుత్ టారిఫ్‌లలో విద్యుత్‌ బిల్లుల రూపంలో ప్రజలపై భారం మోపే అవకాశం ఉంది. టీజీ జెన్‌కో ప్లాంట్లకు సంవత్సరానికి సుమారు 29మిలియన్‌ టన్నుల బొగ్గు అవసరం. అయితే, ప్రస్తుతం పవన శక్తి, సౌర విద్యుత్‌ వంటి ప్రత్యామ్నాయ వనరులు,అలాగే బహిరంగ మార్కెట్‌లో చౌకగా లభించే విద్యుత్‌ కారణంగా జెన్‌కో ప్లాంట్లు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. సంవత్సరాంతంలో గరిష్టంగా 65% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో మాత్రమే పని చేస్తుండగా, ఏడాది మొత్తం సుమారు 15 మిలియన్‌ టన్నుల బొగ్గు కొనుగోలు అవుతోంది.

వివరాలు 

ప్రైవేటు పీపీఏలు ఉన్న సంస్థలపై కూడా మరో రూ.125 కోట్ల జీఎస్టీ భారం

ప్రతి టన్నును సింగరేణి నుండి సగటున రూ.5,000 చొప్పున తీసుకుంటున్నారు. ఇప్పుడు, జీఎస్టీ పెరగడంతో ప్రతి టన్నుకు అదనంగా రూ.630 చెల్లించాల్సి వస్తోంది. అందువల్ల, మొత్తం 15 మిలియన్‌ టన్నులకు రూ.945 కోట్ల అదనపు భారం ఏర్పడుతోంది. అయితే, బొగ్గుపై కొంత రాయితీ ఇవ్వాలన్నది కేంద్రం నిర్ణయం. ఇది తీసివేసినా సంవత్సరానికి కనీసం రూ.300 కోట్ల భారం తప్పనిసరి అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు పీపీఏలు ఉన్న సంస్థలపై కూడా మరో రూ.125 కోట్ల జీఎస్టీ భారం పడే అవకాశం ఉండొచ్చని అంచనా మొత్తానికి రూ.425 కోట్ల వరకు అదనపు భారం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

పరిస్థితిని సమీక్షిస్తున్నాం 

జీఎస్టీ శ్లాబుల మార్పు కారణంగా బొగ్గుపై వ్యయం పెరగడం వల్ల జెన్‌కోపై ఎంత ప్రభావం పడుతుందో పరిశీలిస్తున్నాం. అధికారికంగా శ్లాబులు అమలులోకి వచ్చిన తర్వాత పెరిగిన వ్యయాన్ని విద్యుత్ నియంత్రణ కమిటీకి వివరించనున్నారు. కమిషన్ ఆదేశాల మేరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు - అని టీజీ జెన్‌కో ఛైర్మన్‌ హరీశ్ తెలిపారు.

వివరాలు 

ప్రజలకు ఇది భారమే 

పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులపై జీఎస్టీ వడ్డీ తగ్గింపు వర్తించనుంది. ఇది కొత్త ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుండగా, ఇప్పటి ఉన్న ప్రాజెక్టులకు ప్రయోజనం లేదు. మరోవైపు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వాడే బొగ్గుపై జీఎస్టీ పెంపు చేసింది. సెస్‌ తగ్గించినా మొత్తం భారం ఇంకా అధికంగా ఉంటుంది. ఈ భారం పూర్తిగా విద్యుత్ వినియోగదారులపై పడతుందని, రాబోయే కాలంలో విద్యుత్‌ చార్జీలు పెరిగే అవకాశముందని సెంటర్‌ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్‌ ఎం. వేణుగోపాలరావు స్పష్టం చేశారు.