
మసీదుల్లోనే శబ్ధం వస్తుందా? గుడిలో సౌండ్ రాదా? లౌడ్ స్పీకర్ల నిషేధంపై హైకోర్టు కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
loudspeakers at mosques: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలన్న అభ్యర్థనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
మసీదుల్లో అజాన్(Azaan) కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యం రాదన్నారు.
లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం కోరుతూ బజరంగ్ దళ్ నాయకుడు శక్తిసిన్హ్ జాలా దాఖలు చేసిన పీఐఎల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఈ పిటిషన్ పూర్తిగా అబద్ధమని కోర్టు అభిప్రాయపడింది. మసీదు(mosques)ల్లో అజాన్ పది నిమిషాల పాటు ఉంటుందని, మనవ గొంతు ద్వారా వచ్చే ఈ శబ్దం కాలుష్యానికి కారణం అవడానికి ఆస్కారం లేదని కోర్టు పేర్కొంది.
శబ్ద కాలుష్యానికి కారణమవుతుందని రుజువు చేసే డేటా ఏదైనా అందుబాటులో ఉందా అని కోర్టు ప్రశ్నించింది.
కోర్టు
గుడిలో హారతి సమయంలో డోలు వాయిద్యాల శబ్ధం రాదా?: హైకోర్టు
గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి మైతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయంలో ఉదయం హారతి 3 గంటలకు డోలు వాయిద్యాలతో ప్రారంభమవుతుందని, దీనివల్ల ఎవరికీ ఎలాంటి శబ్దం రాదా? అని ప్రశ్నించింది.
గుడి ఆవరణలో మాత్రమే గంటలు, డోలు వాయిద్యాల శబ్దం వినపడుతుందని మీరు చెప్పగలరా? ఇది ఆలయం వెలుపల వినిపించదా? అని పిటిషనర్ తరపు న్యాయవాదిని విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.
ఇలాంటి పిటిషన్‌ను తాము విచారించబోమని ధర్మాసనం పేర్కొంది. అజాన్ అనేది సంవత్సరాలుగా కొనసాగుతున్న నమ్మకం, సంప్రదాయం అని చెప్పింది.