తదుపరి వార్తా కథనం

Gujrat: గుజరాత్ లో కోతులు పేగును చీల్చడంతో బాలుడు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 14, 2023
01:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కోతులు 10 ఏళ్ల బాలుడిని చంపాయి.ఈఘటన మంగళవారం దేహగాం తాలూకా సాల్కి గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో జరిగినట్లు అటవీశాఖ అధికారులు,పోలీసులు తెలిపారు.
బాధితుడిని దీపక్ ఠాకూర్‌గా గుర్తించారు.ఈ ఘటన జరిగినప్పుడు దీపక్ ఠాకూర్ స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు.
బాలుడి పేగును కోతులు చీల్చాయని ఓ అధికారి పీటీఐకి తెలిపారు.అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
వారం వ్యవధిలో కోతుల దాడి చేయడం ఇది మూడోసారి.అటవీశాఖ అధికారి విశాల్ చౌదరి మాట్లాడుతూ గ్రామంలో కోతులను పట్టుకునేందుకు డిపార్ట్‌మెంట్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది.కోతుల దాడిలో నలుగురు యువకులలో ఇద్దరిని రక్షించారు.
కోతులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు పీటీఐకి తెలిపారు.