
Andhra Pradesh: చివరిదశకు గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్ పనులు
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలుమార్గ (డబ్లింగ్) పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి.
మొత్తం 401 కిలోమీటర్ల మార్గాన్ని డబుల్ ట్రాక్, విద్యుదీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం రూ.3,631 కోట్ల వ్యయాన్ని మంజూరు చేసింది.
ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరించాలనే ఒప్పందం కుదిరింది.
ఇప్పటి వరకు 347 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి, ఇప్పటికే పూర్తియైన భాగాల్లో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
Details
బెంగళూర్, గోవా నుంచి రాయలసీమకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ
ఈ మార్గం పూర్తయిన తర్వాత బెంగళూరు, గోవా వంటి నగరాల నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.
రైళ్ల సమయాల్లో సుమారు 1.30 గంటల సమయాన్ని ఆదా చేయడం సాధ్యమవుతుంది. ఈ మార్గం తూర్పు-పశ్చిమ భారతదేశం మధ్య వాణిజ్య, ప్రయాణ సంబంధాలను మెరుగుపరచనుంది.
కొత్త రైళ్లను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
గోవా ఓడ రేవు నుంచి మచిలీపట్నం వరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.