NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gurpatwant Singh Pannun: పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారు : అమెరికా
    తదుపరి వార్తా కథనం
    Gurpatwant Singh Pannun: పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారు : అమెరికా
    పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారు : అమెరికా

    Gurpatwant Singh Pannun: పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారు : అమెరికా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 18, 2024
    08:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గత సంవత్సరం ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నినట్లు అమెరికా న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది.

    ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ దాడి జరగాలని యత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

    పన్నూన్ హత్యకు కుట్ర చేసిన అధికారిని వికాస్ యాదవ్ (39)గా గుర్తించారని, అతను భారత విదేశీ గూఢచార సేవ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పనిచేశాడని వారు పేర్కొన్నారు.

    అలాగే, రా ఏజెంట్ పన్నూన్ హత్యకు ప్రయత్నించడమేకాక, మనీ లాండరింగ్ కోసం కూడా ప్రయత్నించాడని అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది.

    వివరాలు 

    చెక్ రిపబ్లిక్ లో నిఖిల్ గుప్తా అరెస్ట్ 

    ఈ హత్యకు కుట్ర చేసిన ప్రధాన నిందితుడిగా అమెరికా నిఖిల్ గుప్తాను గుర్తించింది. అతనిని చెక్ రిపబ్లిక్ లో అరెస్టు చేసి, అమెరికాకు అప్పగించారు.

    నిఖిల్ గుప్తా రా ఏజెంట్ వికాస్ యాదవ్ గురించి అమెరికన్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.

    నిఖిల్ గుప్తా స్వయంగా మాట్లాడుతూ, భారత అధికారి (కోడ్ పేరు: సిసిఒన్) పన్నూన్ హత్య చేయమని తనకు సూచించారని యూఎస్ ఏజెన్సీలు వెల్లడించాయి.

    పన్నూన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత 'ఇన్వెస్టిగేటివ్ కమిటీ' కూడా విచారణ జరుపుతుంది.

    వివరాలు 

    ఉగ్రవాదుల జాబితాలో పన్నూన్..

    అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్‌ను హతమార్చేందుకు విఫలమైన ఈ కుట్రపై భారత దర్యాప్తు కమిటీతో గురువారం జరిగిన సమావేశం సానుకూలంగా సాగిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.

    దర్యాప్తులో తాము సంతృప్తిగా ఉన్నామనీ, రా అధికారి వికాస్ యాదవ్ ఇకపై భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని మిల్లర్ ప్రకటించారు.

    ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ ఇప్పటికే భారత ప్రభుత్వం ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు.

    అతను కెనడా, అమెరికాల్లో భారత వ్యతిరేక ర్యాలీలు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

    పన్నూన్ స్థాపించిన సిక్కు ఫర్ జస్టిస్ అనే సంస్థను భారతదేశం నిషేధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    అమెరికా

    తాజా

    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు
    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే! భారత జట్టు

    గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌

    SFJ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదు  భారతదేశం
    SFJ: ఎయిర్ ఇండియాకు పెను ముప్పు.. నవంబర్ 19న విమానంలో ప్రయాణించవద్దన్న పన్నూన్ కెనడా
    కేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్  కెనడా
    Pannun : పన్నూన్‌ హత్యకు భారత ప్రభుత్వం ఉద్యోగిపై ఆరోపణలు..అమెరికాలో కేసు నమోదు ఖలిస్థానీ

    అమెరికా

    Donald Trump: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. డొనాల్డ్ ట్రంప్‌ సురక్షితం అంతర్జాతీయం
    Lebanon Pager Blasts:'పేలుడులో మా పాత్ర లేదు..' లెబనాన్-సిరియాలో పేజర్ బ్లాస్ట్‌పై అమెరికా   అంతర్జాతీయం
    Khalistan: ఖలిస్తానీ టెర్రరిస్టును హత్యకు కుట్ర.. భారత్‌కు అమెరికా కోర్టు సమన్లు ​​  గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    US Federal Reserve: యూఎస్‌ ఫెడ్ వడ్డీ రేటులో కోత..నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025