
Handreeniva: హంద్రీనీవా ఫేజ్-1 విస్తరణ పూర్తీ.. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేందుకు విడుదల తేదీ ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలంలో నెలకు సగటున 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలలపాటు మొత్తం 17.10 టీఎంసీల అదనపు నీటిని అందుకోవడానికి హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ-నీవా సుజల శ్రావంతి) ప్రాజెక్టు విస్తరణ పనులు అవకాశం కల్పించనున్నాయి. ఈ నీటిని వినియోగించేందుకు చేపట్టిన విస్తరణ ద్వారా, ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీటితో సంబంధిత జిల్లాల్లోని తాగునీరు, సాగునీటి సమస్యలు తీరనున్నాయి. ఫేజ్ 1లో నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
Details
ఫేజ్ 2లో
అనంతపురం జిల్లాలో 2.27 లక్షల ఎకరాలు కడప జిల్లాలో 37,500 ఎకరాలు చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు చేరనుంది. ఈ రెండు దశల ద్వారా మొత్తంగా 6 లక్షల పైచిలుకు ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందడంతో పాటు 33 లక్షల మందికి తాగునీటి అవసరాలు నెరవేరనున్నాయి. ఈ విస్తరణ పనులు, ప్రాజెక్టు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు, రాయలసీమ ప్రాంతానికి నీటి పరంగా స్థిరత్వం తీసుకొస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.