PM Modi - DSP : అమెరికా స్టేజ్‌పై హర్ ఘర్ తిరంగా సాంగ్.. దేవి శ్రీ ప్రసాద్‌ను హత్తుకున్న నరేంద్ర మోదీ
సప్తసముద్రాలు దాటి భారతీయతను దేవిశ్రీ ప్రసాద్ చాటి చెప్పాడు. దేశభక్తి గానం న్యూయార్క్‌లో సందడి చేసింది. టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ న్యూయార్క్‌లో జరిగిన "మోదీ అండ్ యూఎస్" కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో "హర్ ఘర్ తిరంగా" పాటను ఆలపించారు. సరిగ్గా అదే సమయానికి ప్రధాని నరేంద్ర మోదీ వేదిక మీదకు రావడంతో దేశభక్తి ఉప్పొంగింది. ఈ కార్యక్రమంలో, దేవిశ్రీ ప్రసాద్ ప్రదర్శనతో పాటు, ప్రధాని మోదీ వేదికపైకి రావడం మరో విశేషం. దేశభక్తి గీతం పాడిన తర్వాత ప్రధాని మోదీ, దేవిశ్రీ ప్రసాద్‌ను వ్యక్తిగతంగా అభినందించారు.
మోదీని కొనియాడిన దేవిశ్రీ ప్రసాద్
ప్రధాని మోదీ సమక్షంలో దేశభక్తి గీతం పాడటం గొప్ప అవకాశమని, ఆయన అభినందించడం జీవితంలో మరచిపోలేని క్షణమని దేవి శ్రీ ప్రసాద్ చెప్పారు. మోదీ శాంతియుతమైన, స్ఫూర్తిదాయకమైన నాయకుడు అని,శ్రోతల అభిమానం, ప్రేమ వల్లే తనకు ఈ స్థాయి వచ్చిందని దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు.