LOADING...
Harish Rao : కేసీఆర్‌ ఆరోగ్యంపై హరీశ్ రావు కీలక సమాచారం.. సాయంత్రం హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీకి ఏర్పాట్లు
సాయంత్రం హిప్‌ రిప్లేస్‌మెంట్‌'కి ఏర్పాట్లు

Harish Rao : కేసీఆర్‌ ఆరోగ్యంపై హరీశ్ రావు కీలక సమాచారం.. సాయంత్రం హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీకి ఏర్పాట్లు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 08, 2023
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సమాచారం వెల్లడించారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్‌కు వైద్యులు తుంటి ఎముక రిప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని హరీశ్‌ రావు వివరించారు. ఈ మేరకు యశోద ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ అనుమతి లేనందున కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు రాకూడదన్నారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తారన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే కేసీఆర్‌ ఉన్నారని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. వైద్య చికిత్సల అనంతరం 6 నుంచి 8 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని, ఈ మేరకు పూర్తిగా కోలుకుంటారని హరీశ్ స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేసీఆర్ ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటన