KCR : కేసీఆర్ గాయంపై ప్రధాని మోదీ ఆవేదన.. ఏమన్నారంటే
గులాబీ దళపతి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. సోషల్ మీడియా X ద్వారా మోదీ స్పందించారు. కేసీఆర్‌కు గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడినట్టు మోదీ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. ఫాంహౌస్‌లోని బాత్రూంలో ప్రమాద వశాత్తు జారిపడి హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 11 గంటలకు శస్త్రచికిత్స నిర్వహించనున్నామన్న వైద్య బృందం, విరిగిన తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంగా కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నట్లు సమాచారం.