Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన హరీశ్ రావు.. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేయాలి
ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ,హామీల అమలుపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటైన సవాల్ విసిరారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. అధికార పక్షాన్ని నిలదీయడమే ప్రతిపక్షాల కర్తవ్యమని,సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తా.సీఎం కూడా అక్కడికి వచ్చి ఆగస్టు 15లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తానని ప్రమాణం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిర్ణీత గడువులోగా నెరవేరుస్తుందా, హామీలు నెరవేర్చకుంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే సాహసం చేస్తారా అని హరీశ్ రావు సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.
పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం: హరీష్ రావు
సీఎం రేవంత్‌కి కౌంటర్ రెస్పాన్స్‌లో హరీష్ రావు రాజకీయ పదవుల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల తనకున్నతిరుగులేని నిబద్ధతను నొక్కిచెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించిన హరీశ్‌రావు,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని,మహిళల కోసం మహాలక్ష్మి పథకం,రైతులకు రైతు బంధు వంటి సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరిగిందని విమర్శించారు. పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్న హరీష్ రావు..ఆరు గ్యారంటీలను డిసెంబర్ 9న అమలు చేస్తామని చెప్పిన అధికార పక్షం..ఆమాట తప్పిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పార్టీ రద్దు చేసుకుంటారా అంటూ కాంగ్రెస్ తొండి మాటలు మాట్లాడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చి 120 రోజులైంది..మీ గ్యారంటీలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు?