Mohanlal Badoli: హిమాచల్‌లోని కసౌలీలో గ్యాంగ్‌రేప్.. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలిపై రేప్ కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలిపై (Mohanlal Badoli) ఒక యువతి లైంగిక దాడి కేసు నమోదుచేసింది.
ఢిల్లీకి చెందిన ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదులో, ఆయనతోపాటు గాయకుడు రాకీ మిట్టల్ (జై భగవాన్) కూడా ఈ ఘటనలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు.
2023 జూలై 3న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు వెల్లడించారు. ఆమె వివరాల ప్రకారం, తన యజమాని, స్నేహితురాలితో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీకి పర్యాటక ప్రయాణానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదులో, బడోలిని సీనియర్ రాజకీయ నాయకుడిగా, రాకీ మిట్టల్‌ను సింగర్‌గా పరిచయం చేసుకున్నారని, ఆమెకు సినిమా ఆల్బమ్‌లో నటనకు అవకాశం కల్పిస్తామంటూ చెప్పారని పేర్కొన్నారు.
వివరాలు
376డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు
అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపుతూ తనను ప్రలోభ పెట్టారని చెప్పారు.
ఆ తర్వాత బలవంతంగా మద్యం తాగించి, ఆమె స్నేహితురాలిని బెదిరించి పక్కకు తీసుకెళ్లారని, అనంతరం ఇద్దరూ కలిసి తనపై సామూహిక లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ దాడి సమయంలో తన నగ్న చిత్రాలు,వీడియోలు తీసి,ఈ విషయం బయట చెప్పితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలు ఆరోపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా సోలన్ పోలీసులు 376డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందని,ఇప్పటివరకు ఎవ్వరినీ అరెస్టు చేయలేదని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ వెల్లడించారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.