Haryana election results: జులానా స్థానం నుంచి వినేష్ ఫోగట్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
కుస్తీ యోధురాలు, కాంగ్రెస్ నాయకురాలు వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆమె జులానా నియోజకవర్గం నుంచి విజేతగా నిలిచారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ, ఎన్నికల సమరంలో మాత్రం ఆమె విజయవంతంగా ముందుకు సాగారు.
ఈ పోటీలో బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్, ఆప్ అభ్యర్థి కవితా రాణి ఆమె చేతిలో ఓడిపోయారు.
ఆమె జులానా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.
మరోవైపు ,రాష్ట్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రానున్న అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు
వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
''భారత పుత్రిక వినేశ్ ఫొగాట్‌కు శుభాకాంక్షలు. ఇది కేవలం జులానా సీటుకు సంబంధించిన పోటీ కాదు,మూడు లేదా నాలుగు పార్టీల మధ్య పోటీ కూడా కాదు. ఇది బలమైన అణచివేత శక్తుల మధ్య జరిగిన పోరాటం. ఇందులో వినేశ్ విజయం సాధించింది'' అని పేర్కొన్నారు.
వినేశ్ బీజేపీ అభ్యర్థిపై సుమారు ఆరు వేల ఓట్ల తేడాతో గెలిచారు.హరియాణా ఎన్నికలు అక్టోబర్ 5న జరిగిన తర్వాత,ఈ రోజు ఫలితాలు వెలువడాయి.
రాష్ట్రంలో బీజేపీ మూడోసారి అధికారాన్ని చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మొదట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నా, చివరికి బీజేపీ ఆధిక్యంలోకి రావడంతో, కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది.
వివరాలు
కాంగ్రెస్‌లో చేరి రాజకీయ జీవితం
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై, ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు.
ఈ ఘటన భారత దేశాన్ని తీవ్రంగా బాధించింది. తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వినేశ్, కాంగ్రెస్‌లో చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు.