Haryana: రాష్ట్రపతి భవన్ ప్రత్యేక అతిథిగా హరియాణా రైతు యశ్‌పాల్ ఖోలా
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా రాష్ట్రం రేవాడీ జిల్లా కన్వాలీ గ్రామానికి చెందిన రైతు యశ్‌పాల్ ఖోలా మూడు రోజుల పాటు ప్రత్యేక అతిథిగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రకృతి సాగులో విశేష విజయాలు సాధించినందుకు యశ్‌పాల్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా సత్కరించనున్నారు. యశ్‌పాల్ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన 2016లో చోటు చేసుకుంది.
వివరాలు
రోగ్యకరమైన పంటల సాగుకు శ్రీకారం
ఆయన తండ్రి క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురైన యశ్‌పాల్ ఆ రోజు నుంచే రసాయన ఎరువులను పూర్తిగా విడిచిపెట్టారు. ప్రకృతి అనుకూలమైన వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేసి, ఆరోగ్యకరమైన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తన చుట్టుపక్కల రైతులకూ ప్రకృతి సాగు ప్రాముఖ్యతను వివరిస్తూ, వారిని ఆ దిశగా మళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. దేశవ్యాప్తంగా యశ్‌పాల్‌లా ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన మరో ఐదుగురికి కూడా రాష్ట్రపతి భవన్ నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
77వ గణతంత్ర వేడుకల్లో ప్రకృతి సాగు స్ఫూర్తి రైతు సత్కారం
#Haryana
— Zee Delhi-NCR Haryana (@ZeeDNHNews) January 19, 2026
गणतंत्र दिवस पर यशपाल होंगे सम्मानित
3 दिन राष्ट्रपति के बनेंगे मेहमान #Farmer #ZeeDNH pic.twitter.com/WmaAajSnK0