
నూహ్‌లో బుల్డోజర్ యాక్షన్.. మెడికల్ షాపులు, దుకాణాలు నేలమట్టం
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలోని నుహ్‌లో రెండో రోజైన శనివారం కూడా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఈ మేరకు అక్రమ కట్టడాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అధికారులు కూల్చుతున్న ఆయా కట్టడాలు అల్లర్లకు పాల్పడ్డ నిందితులకు చెందినవిగా సమాచారం.
నల్హార్ ప్రాంతంలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపే లక్ష్యంగా బుల్డోజర్లు పని చేస్తున్నాయి. ఆస్పత్రి సమీపంలోని మెడికల్ దుకాణాలు, ఇతర షాపులను పడగొడుతున్నారు.
ఉదయం నుంచి దాదాపుగా 60 వరకు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశామని అధికారులు ప్రకటించారు. శుక్రవారం తావ్‌డూలో 250 అక్రమ గుడిసెలను కూల్చేశారు.
అయితే పోలీసులు తమను అరెస్ట్ చేస్తారోనన్న భయంతో ఆయా దుకాణాదారులు పారిపోయారని అధికారులు పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతోనే కూల్చివేతల ప్రక్రియ చేపట్టామన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దుకాణాలను కూల్చివేస్తున్న దృశ్యం
#WATCH | Haryana administration demolishes illegal constructions near SKM Government Medical College in Nuh district pic.twitter.com/r2htjmGpyh
— ANI (@ANI) August 5, 2023