LOADING...
హర్యానా: రంగంలోకి బుల్డోజర్లు.. నూహ్‌ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేత
Write captionనూహ్‌ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేత here

హర్యానా: రంగంలోకి బుల్డోజర్లు.. నూహ్‌ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 04, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూహ్‌ అల్లర్లకు పాల్పడ్డ నిందితుల అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆయా ఇళ్లను స్థానిక అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు వారిని గుర్తిస్తున్నారు. వీరిలో చాలా మందికి చెందిన అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నూహ్‌ జిల్లాలోని తావుడులో అక్రమంగా నిర్మించిన 250 ఆవాసాలను పడగొట్టారు. హింసకాండలో పాల్గొన్న సదరు నిందితులంతా అక్రమంగా వలసవచ్చినవారేనని అధికారులు చెబుతున్నారు. గత నాలుగు సంవత్సరాల్లో బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వారు, ఇక్కడి స్థలాలను కబ్జాచేసినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం ఆయా భూముల్లో పూరి గుడిసెలను ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హర్యానాలో రంగంలోకి బుల్డోజర్లు