LOADING...
నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. మత అల్లర్లే కారణం
నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. మత అల్లర్లే కారణం

నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. మత అల్లర్లే కారణం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 04, 2023
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా రాష్ట్రం మత ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఈ మేరకు నుహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు పడింది. ఇటీవలే నుహ్‌లో అల్లర్లు చెలరేగిన సందర్భంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత తాజాగా ఎస్పీకి స్థానచలనం కలిగింది. ఈ క్రమంలో భివానీ ఎస్పీగా(SP) ట్రాన్స్ ఫర్ అయ్యారు. వీహెచ్‌పీ (VISHWA HINDU PARISHAD) ర్యాలీలో ఘర్షణలు చోటు చేసుకున్న రోజు ఎస్పీ వరుణ్ సింగ్లా సెలవుపై ఉన్నారు. అంతకుముందే నుహ్ జిల్లా పోలీస్ బాధ్యతలను పాల్వాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎస్పీ సింగ్లా స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

DETAILS

ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో అమల్లో ఉన్న నిషేదిత ఉత్తర్వులు

ప్రస్తుతం అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)కు బిజార్నియా ప్రత్యేక అధికారి(OSD)గా పని చేస్తున్నారు. నుహ్ లో శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నుహ్‌లో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపులో అల్లర్లు చెలరేగడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటన గురుగ్రామ్, సోహ్నా సహా ఇతర ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ నిషేధిత ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. హింస కారణంగా ఇప్పటివరకు ఆరుగురు చనిపోగా, 176 మందిని అరెస్ట్ చేశారు. 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలకు సంబంధించి 93 ఎఫ్‌ఐఆర్‌(FIR)లు నమోదయ్యాయి. క్రమంగా అల్లర్లు రాజస్థాన్‌లోని భివానీతో పాటు హర్యానా, దిల్లీ సరిహద్దు ప్రాంతాలకు వ్యాపించడం ఆందోళనకరంగా ఉంది.