Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు
హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస అంశం సుప్రీంకోర్టుకు చేరింది. నుహ్, గురుగ్రామ్‌లో చెలరేగిన హింసకు వ్యతిరేకంగా దిల్లీతో పాటు, హర్యానాలో వీహెచ్‌పీ- బజరంగ్ దళ్ చేపట్టిన ర్యాలీలను ఆపాలంటూ బుధవారం దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అత్యవరస విచారణ చేపట్టింది. ర్యాలీలో విద్వేషపూరిత ప్రసంగాలు లేదా హింసాత్మక ప్రసంగాలు జరగకుండా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసులు లేదా పారామిలటరీ బలగాలను మోహరించాలని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, ఎస్వీ భట్టిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
హర్యానా హింసలో ఆరుగురు మృతి
మితవాద గ్రూపులు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించాయని జర్నలిస్టు షాహీన్ అబ్దుల్లా తరఫు సీనియర్ న్యాయవాది సియు సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఈ పటిషన్‌పై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ఈ మేరకు ర్యాలీలను ఆపాలంటూ ఆదేశాలు చేయని సుప్రీంకోర్టు ధర్మానసం, జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 31న, హర్యానాలోని నుహ్‌లో వీహెచ్‌పీ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం జరిగిన తర్వాత మతపరమైన హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు చనిపోయారు.