Election Results: హర్యానాలో హోరాహోరీ .. జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి జోరు
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మంగళవారం కొనసాగుతోంది.
హర్యానాలో ఫలితాలు క్షణం క్షణానికి మారుతూ ఉన్నాయి. మొదటగా కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నా, తరువాత బీజేపీ క్రమంగా పుంజుకుంటోంది.
మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి హవా కొనసాగుతోంది.
వివరాలు
ఉదయం 10 గంటల వరకు విడుదలైన ఫలితాల పరిస్థితి
హర్యానా : హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 46 స్థానాలు అవసరం.
ప్రస్తుతం బీజేపీ 45 స్థానాల్లో ముందంజలో ఉంది, కానీ కాంగ్రెస్ ఆధిక్యం 38కి తగ్గింది. ఇతర పార్టీలు 4 స్థానాల్లో, ఐఎన్‌ఎల్‌డీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆసక్తికరంగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఏ స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది.
జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో అధిక్యంలో ఉంది. బీజేపీ 23, పీడీపీ 3, కాంగ్రెస్ 9 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతర పార్టీలు 13 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ బీజేపీ,పీడీపీ ఒంటరిగా పోటీ చేశారు, కాగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిలో ఉన్నాయి.