
Rakesh Daultabad: హర్యానాలో స్వతంత్ర MLA మృతి.. సంక్షోభంలో సర్కార్
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా లో ఓ స్వతంత్ర MLA ..రాకేష్ దౌల్దాబాద్(44) గుండె పోటుతో ఆకస్మికంగా కనుమూశారు.
ఆ రాష్ట్ర రాజకీయాల్లోరాకేష్ కీలక కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. అక్కడి సర్కార్ మెజారిటీకి తగిన సంఖ్యా బలం లేక సతమతమవుతోంది.
90 మంది సభ్యులున్నహర్యానా అసెంబ్లీలోరాకేష్ అకాల దుర్మరణంతో బిజెపి బలం 87కి పడిపోయింది.
అధికారిక బిజెపికి తగినంత బలం లేదు. తొలిసారిగా బాద్షా పూర్ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారు రాకేష్.
మొదటి నుంచి బిజెపికి మద్దతు ఇస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు.
రాకేష్ అకాల మృతికి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Details
మేజిక్ ఫిగర్ కోసం పాట్లు
మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ , కర్నాల్ స్ధానానికి రాజీనామా చేశారు. నయాబ్ సింగ్ కోసం తన సీటును కట్టర్ ..వదులుకున్నారు.
ఇదిలా వుంటే మరో స్వతంత్ర MLA రంజిత్ చౌతాలా రైనా సీటును వదులుకుని బిజెపిలో చేరారు.
బిజెపి నుంచి MLA కావాలని రంజిత్ ఆశిస్తున్నారు. కాగా హర్యానా అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 44 మంది సభ్యులు అవసరం వుంది.
కాగా బిజెపికి కేవలం 40 మంది సభ్యుల బలం మాత్రమే వుంది. స్వతంత్ర MLAల సాయంతో ఎలాగో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నెట్టుకొస్తున్నారు.