LOADING...
Haryana: గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య 
గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య

Haryana: గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 03, 2024
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పశువుల స్మగ్లర్‌గా భావించి గోసంరక్షకులు 12వ తరగతి విద్యార్థి అయిన ఆర్యన్ మిశ్రాను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి గోసంరక్షక బృందంలోని ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్, సౌరభ్‌లుగా గుర్తించారు. ఈ దారుణం హర్యానాలోని గధ్‌పురి సమీపంలో ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆర్యన్, అతని స్నేహితులు శాంకీ, హర్షిత్‌లను పశువుల స్మగ్లర్లుగా అనుమానించి, నిందితులను సుమారు 30 కిలోమీటర్ల వరకు వారి కారును వెంబడించారు.

Details

పోలీసుల అదుపులో నిందితులు

రెనాల్ట్ డస్టర్, టయోటా ఫార్చూనర్ కార్లలో పశువుల స్మగ్లర్లు నగరంలోకి ప్రవేశించి పశువులను ఎత్తుకుపోతున్నట్లు గోసంరక్షకులకు సమాచారం అందింది. నిందితులు పశువుల స్మగ్లర్ల కోసం వెతుకుతుండగా, పటేల్ చౌక్ వద్ద హర్షిత్ నడుపుతున్న డస్టర్ కారు కనిపించింది. కారు ఆపకపోవడంతో నిందితుల కారుపై కాల్పులు జరిపారు. ప్యాసింజర్ సీటులో ఉన్న ఆర్యన్ మెడ దగ్గర బుల్లెట్ దూసుకుపోయింది. ఆర్యన్‌ను ఆసుపత్రికి తరలించినా పరిస్థితి విషమించి మరుసటి రోజు అతను మరణించాడు. ఘటనలో ఉపయోగించిన ఆయుధం చట్టవిరుద్ధమైనదని అధికారులు వెల్లడించారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.