NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Murder: గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Murder: గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య
    గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య

    Murder: గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 27, 2025
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రద్ధ వాకర్ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు దారుణ ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా దిల్లీలో ఘాజీపూర్‌లో జరిగిన హత్య ఈ తరహా ఘటనకు మరో ఉదాహరణగా నిలిచింది.

    ఘజియాబాద్‌లో ఓ నిర్జన ప్రదేశంలో సూట్‌కేస్‌లో కాలిపోయిన మృతదేహం పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో సాక్ష్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    తూర్పు ఢిల్లీ డీసీపీ అభిషేక్ ధనియా మీడియాకు వివరాలను వెల్లడించారు. మొదట మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, సీసీటీవీ ఫుటేజ్‌ను స్కాన్ చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.

    సీసీటీవీ ఆధారంగా ఓ హ్యుందాయ్ వెర్నా కారు ఆ ప్రాంతంలో కనిపించిందని గుర్తించారు.

    Details

    కార్ నెంబర్ ఆధారంగా గుర్తింపు

    కార్ నెంబర్ ఆధారంగా లోనీ ప్రాంతంలోని ఓ వ్యక్తిని అన్వేషించారు. ఆ వ్యక్తి తన కారును అమిత్ తివారీ అనే వ్యక్తికి అమ్మినట్లు తెలిపారు.

    సీసీటీవీ ఆధారంగా 22 ఏళ్ల అమిత్ తివారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమిత్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఘజియాబాద్‌లో నివసిస్తున్నాడు.

    అతడితో పాటు సీసీటీవీలో కనిపించిన అనుజ్ కుమార్ అనే వెల్డింగ్ మెకానిక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అమిత్ ఆ మృతదేహం తన కజిన్ శిల్పా పాండే దేనిగా గుర్తించాడు.

    అమిత్, శిల్పా గతేడాది కాలంగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారని, శిల్పా అతడితో వివాహం చేయాలని కోరగా అమిత్ ఆమెను వదిలిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది.

    Details

    పోలీసులు అదుపులో ఇద్దరు నిందితులు

    శనివారం రాత్రి మద్యం మత్తులో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ శిల్పా హత్యకు దారితీసింది. ఆవేశంలో అమిత్ ఆమె గొంతు కోసి చంపాడు.

    శవాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి, తన స్నేహితుడు అనుజ్ సాయంతో నిర్జన ప్రదేశంలో పడేసి, డీజిల్ పోసి కాల్చినట్లు విచారణలో తేలింది.

    మృతదేహాన్ని మొదట ఉత్తర్ ప్రదేశ్‌లో మారుమూల ప్రాంతంలో పడేయాలని అనుకున్నా, దానికి ముందు చెక్‌పోస్టులను దాటారు.

    తర్వాత డీజిల్ కొని, ఘజియాబాద్ సమీపంలోని ఘాజీపూర్‌లో ఈ దారుణానికి పాల్పడ్డారు. శిల్పా తల్లిదండ్రులు సూరత్‌లో నివసిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

    ప్రస్తుతం అమిత్, అనుజ్ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కేసును విచారిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హత్య

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Delhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు బాంబు బెదిరింపు
    Delhi: ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమానిత బ్యాగ్ కలకలం.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు భారతదేశం
    Delhi: బంగ్లాదేశ్‌ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్‌.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు  బీజేపీ
    Arvind Kejriwal  : లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి అరవింద్ కేజ్రీవాల్

    హత్య

    Pune : పూణెలోని హోటల్ గదిలో మహిళా టెక్కీని కాల్చి చంపిన బాయ్‌ఫ్రెండ్  భారతదేశం
    US: సాయం చేసిన భారత విద్యార్థిని సుత్తితో కొట్టి చంపేసిన దుండగుడు అమెరికా
    Neel Acharya: అమెరికాలో హత్యకు గురైన మరో భారతీయ విద్యార్థి! అమెరికా
    Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025