Loading...
Kerala Sailor: పెళ్లి కలలు కలగానే ముగిశాయి.. ఉక్రెయిన్‌లో కేరళ సెయిలర్ మృతి
పెళ్లి కలలు కలగానే ముగిశాయి.. ఉక్రెయిన్‌లో కేరళ సెయిలర్ మృతి

Kerala Sailor: పెళ్లి కలలు కలగానే ముగిశాయి.. ఉక్రెయిన్‌లో కేరళ సెయిలర్ మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని, మెరుగైన ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న కేరళ యువ నావికుడు అఖిల్ జోయాన్‌ (26) జీవితం విషాదాంతమైంది. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై ఆదివారం జరిగిన దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పెళ్లి సందడి నెలకొనాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. కుమారుడి వివాహాన్ని ఘనంగా జరపాలని ఆశించిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం,కేరళలోని కాసర్‌గఢ్‌ జిల్లాకు చెందిన జోయాన్‌,శాలీ దంపతులకు అఖిల్ ఏకైక కుమారుడు. గత ఆరు సంవత్సరాలుగా'ఎంవీ గోల్డెన్ లియో'వాణిజ్య నౌకలో నావికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని వారాల క్రితమే అతడి నిశ్చితార్థం జరిగింది.

వివరాలు 

మృతులలో అఖిల్‌తో పాటు మరో ముగ్గురుభారతీయులు

నెల రోజుల క్రితం తిరిగి విధుల్లో చేరిన అఖిల్,మరో మంచి ఉద్యోగం సంపాదించి రాబోయే రెండు నెలల్లో వివాహం చేసుకోవాలని ప్రణాళికలు వేసుకున్నాడు.

అయితే,ఆదివారం నౌకపై జరిగిన దాడిలో అతడు మరణించినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

అఖిల్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగశాఖను కోరారు.

ఈ నేపథ్యంలో రష్యన్ కాన్సులేట్‌తో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఇదిలా ఉండగా,ఉక్రెయిన్‌పై జరిగిన రష్యా దాడిలో అఖిల్‌తో పాటు మరో ముగ్గురుభారతీయులు కూడా ప్రాణాలుకోల్పోయినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో భారతీయనావికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది.

ADVERTISEMENT