LOADING...
Telangana: ఈ పాఠశాలలో విద్యార్థులకు రోజూ కొబ్బరి లడ్డూ..ప్రధానోపాధ్యాయుడి వినూత్న ఆలోచన
ప్రధానోపాధ్యాయుడి వినూత్న ఆలోచన

Telangana: ఈ పాఠశాలలో విద్యార్థులకు రోజూ కొబ్బరి లడ్డూ..ప్రధానోపాధ్యాయుడి వినూత్న ఆలోచన

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెద్దపల్లి జిల్లా (Peddapalli district) పరిధిలోని పాలకుర్తి మండలంలో (Palakurthi mandal)ఉన్న ఎల్కలపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంతో పాటు ఒక్కొక్కరికి ఒక కొబ్బరి లడ్డూ అందజేస్తున్నారు. తక్కువ వ్యయంతో పిల్లలకు పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గత ఏడాదిన్నరగా నిరంతరంగా అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు మొత్తం 90 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

వివరాలు 

లడ్డూలు అందించలేని పరిస్థితిలో అరటి పండ్లు

ప్రతి రోజూ సుమారు 90 లడ్డూల తయారీకి కావాల్సిన కొబ్బరికాయలను ప్రధానోపాధ్యాయుడు స్వయంగా సేకరిస్తున్నారు. రామగుండం (Ramagundam) ప్రాంతంలోని దేవాలయాలకు వెళ్లే సందర్భంలో అక్కడి నుంచి కొబ్బరికాయలను తీసుకువచ్చి పాఠశాలకు అందిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజన సిబ్బంది వాటితో లడ్డూలను తయారు చేస్తున్నారు. లడ్డూల తయారీకి అవసరమైన బెల్లం, యాలకులు వంటి పదార్థాలను కూడా ప్రధానోపాధ్యాయుడే సమకూరుస్తున్నారు. ఏదైనా కారణంతో లడ్డూలు అందించలేని పరిస్థితి ఏర్పడితే, దాతలు,పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేస్తున్నారు.

Advertisement