LOADING...
Telangana: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుల విచారణ
ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుల విచారణ

Telangana: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుల విచారణ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 6వ తేదీ నుంచి విచారించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయించారు. గత ఎన్నికల్లో భారాస తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు తరువాత కాంగ్రెస్‌లో చేరినట్టు భారాస ఎమ్మెల్యేలు స్పీకర్‌కు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కేసుల్లో ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. ఇక రాబోయే విచారణల్లో 6, 12 తేదీల్లో తెల్లం వెంకట్రావు, సంజయ్‌కు సంబంధించిన పిటిషన్లు.. 7, 13 తేదీల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై వచ్చిన పిటిషన్లను పరిశీలిస్తారు.

వివరాలు 

ముగిసిన సుప్రీంకోర్టు గడువు

ఆయా తేదీల్లో ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు. ఈ షెడ్యూల్‌ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కాగా, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుల విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు గత నెల 31తో ముగియడంతో, ఇంకా రెండు నెలల సమయం అవసరమని స్పీకర్‌ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టుకు అభ్యర్థించిన విషయం తెలిసిందే.