
Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిమ్స్‌లో ఇప్పటికే కొనసాగుతున్న విభాగాలతో పాటు తాజాగా గుండె శస్త్రచికిత్స (కార్డియాక్ సర్జరీ) విభాగాన్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ అహంథెం సాంతా సింగ్ తెలిపారు.
గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక పరికరాలన్నీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు ఆయన స్పష్టంచేశారు.
అంతేకాకుండా ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు రోబోటిక్ సర్జరీల సేవలు కూడా ప్రారంభించినట్లు వివరించారు.
ప్రపంచ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని,ఎయిమ్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు సోమవారం నిర్వహించిన వాక్‌థాన్‌ను డైరెక్టర్ ప్రారంభించారు.
ఈర్యాలీ ఎయిమ్స్ మంగళగిరి నుంచి అంబేడ్కర్ విగ్రహం కూడలి వరకు కొనసాగింది.
కార్డియాక్ అరెస్ట్ వంటి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే సీపీఆర్ (కార్డియోపల్మనరీ రెసుసిటేషన్) ప్రక్రియపై ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
వివరాలు
కంటింజెన్సీ ఆసుపత్రిగా ఎయిమ్స్ మంగళగిరి
ముఖ్యమంత్రికి అత్యవసర వైద్య సేవలందించేందుకు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిని కూడా కంటింజెన్సీ ఆసుపత్రిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఇప్పటివరకు మణిపాల్ ఆసుపత్రి మాత్రమే కంటింజెన్సీ హాస్పిటల్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు ఎయిమ్స్ కూడా ఈ జాబితాలో చేరింది.