LOADING...
Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్త బిల్లు.. లోక్‌సభలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రియాంక గాంధీ
లోక్‌సభలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్త బిల్లు.. లోక్‌సభలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రియాంక గాంధీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర వివాదం రేపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో 'వికసిత్ భారత్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు-2025'ను పరిచయం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.కాంగ్రెస్ అగ్రనేత్రి,వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో రూల్ 72(1) కింద ప్రియాంక గాంధీ బిల్లుపై తమ వ్యతిరేకతను ప్రకటించారు.

వివరాలు 

కొత్త చట్టంతో ఉపాధి హక్కు బలహీనపడుతుందని ఆందోళన 

"గత 20 ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన చట్టాన్ని బలహీనపరిచే కొత్త బిల్లును మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని ఆమె స్పష్టం చేశారు. క్రొత్త చట్టం ప్రకారం డిమాండ్ ఆధారిత నిధుల కేటాయింపు విధానాన్ని రద్దు చేసి, కేంద్రం ముందే నిధులను నిర్ణయించే విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రియాంక ఆరోపించారు. ఈ మార్పు గ్రామ సభల పాత్రను కూడా బలహీనతపరుస్తుందని, రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆమె అన్నారు. కేంద్రం కొన్ని రాష్ట్రాలకు కేటాయించే వాటాను 60 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, ఇప్పటికే జీఎస్టీ బకాయిల కారణంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలపై మరిన్ని భారాలు పడుతాయని ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంతో అనుగుణంగా రూపకల్పన 

ఈ క్రమంలో ట్రెజరీ బెంచీల నుంచి 'కుటుంబం' గురించి ఒకరు వ్యాఖ్యానించగా.. "మహాత్మా గాంధీ నా కుటుంబ సభ్యుడు కాదు, కానీ నా కుటుంబ సభ్యుడి లాంటి వారు. దేశం మొత్తం అలాగే భావిస్తుంది" అని ఆమె గట్టిగా బదులిచ్చారు. ఇక మరోవైపు,ప్రభుత్వ వర్గాలు విమర్శలకు స్పందిస్తూ,ఈ బిల్లును 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంతో అనుగుణంగా రూపకల్పన చేసినట్టు చెప్పారు. డిమాండ్ ఆధారిత కేటాయింపుల కారణంగా బడ్జెట్‌లో అనిశ్చితి ఏర్పడుతోందని, కొత్త విధానంతో స్థిరమైన ప్రణాళికతో నిధులు కేటాయించడం సాధ్యమవుతుందని వివరించారు. గమనార్హంగా, ఈ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొత్త బిల్లుకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ ఫొటోలతో నిరసన ప్రదర్శించారు.

Advertisement