LOADING...
Nagarjuna sagar: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 22 గేట్లు ఎత్తివేత 
నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 22 గేట్లు ఎత్తివేత

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 22 గేట్లు ఎత్తివేత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ స్పిల్‌వే ద్వారా 1.71 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇన్‌ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా, ఔట్‌ఫ్లో 2.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం సాగర్‌లో 587 అడుగుల నీటి మట్టం ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 305 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.