తదుపరి వార్తా కథనం

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం..26 గేట్లు ఎత్తివేత
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 20, 2025
08:16 am
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. వరద ఒత్తిడి అధికంగా ఉండటంతో అధికారులు 26 గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో సుమారు 10 లక్షల క్యూసెక్కులుగా నమోదు కాగా, ఔట్‌ఫ్లో మాత్రం 4.06 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. ప్రస్తుతం అందులో 294.55 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ఈ క్రమంలో, వచ్చే వరదల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.