తదుపరి వార్తా కథనం

Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రేపు భారీ వర్ష సూచన
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 01, 2025
11:30 am
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశలో కదిలి, గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 3న ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తా వరకు తీరం దాటనుందని సూచించారు.
Details
కోసాంధ్ర, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
ఈ పరిణామాల నేపథ్యంలో కోస్తాంధ్ర, తెలంగాణకు ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ ప్రకారం, గురువారం, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పాటు తీరం వెంబడి 30 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీశే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.