LOADING...
Delhi Rain: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

Delhi Rain: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ఉద్యోగులు తమ డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Details

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

మరోవైపు, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు, హిమపాతం బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలతో రహదారులు మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్నిచోట్ల కార్లు కొట్టుకుపోయాయి. అలాగే, రోడ్లు ధ్వంసమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.