తదుపరి వార్తా కథనం

Heavy Rain in Delhi: దిల్లీలో భారీ వర్షం; రోడ్లన్నీ జలమయం
వ్రాసిన వారు
Stalin
Aug 19, 2023
09:36 am
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్‌లో కూడా వర్షం తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం పడింది.
వర్షంతో పాటు ఉరుములతో గంటకు 30-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉంటే, శనివారం ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగానే అంచనా వేసింది.
భారీ వర్షానికి సెంట్రల్ విస్టా అవెన్యూ (కర్తవ్య మార్గం)ను వరద ముంచెత్తింది. యమునా నది నీటిమట్టం శుక్రవారం సాయంత్రం నాటికి 204.5 మీటర్లు ఉంది. వర్షానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీలో వర్షం పడుతున్న దృశ్యం
#WATCH | Rain showers trigger waterlogging on roads in Badarpur area of Delhi. pic.twitter.com/uesP55CfK6
— ANI (@ANI) August 19, 2023