NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
    తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2025
    03:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉపరితల ఆవర్తనం,అల్పపీడనద్రోణి ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

    బుధవారం మధ్యాహ్నం నుంచే హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది.

    ముఖ్యంగా సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, బేగంపేట, అల్వాల్, తిరుమలగిరి వంటి ప్రాంతాల్లో వర్షం పడింది.

    ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ పలు జిల్లాల్లోకి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

    వర్ష ప్రభావంతో రైతులు ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

    మే 22, 23, 24 తేదీల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

    వివరాలు 

    మరో మూడు రోజులపాటు వర్షాలే.. 

    నేటి నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలున్నాయి. దాంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు తక్కువగా నమోదుకానున్నాయి.

    గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

    తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హైదరాబాద్ వాతావరణ శాఖ  చేసిన ట్వీట్ 

    7-day forecast(Morning) of Telangana state based on 0000 UTC issued at 1000 Hrs IST Dated : 21/05/2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather pic.twitter.com/ZTNYeCkdlZ

    — Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 21, 2025

    వివరాలు 

    దిగొస్తున్న పగటి ఉష్ణోగ్రతలు 

    ప్రస్తుతం తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.

    అయితే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైగా నమోదైంది. ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి:

    ఆదిలాబాద్ - 41.3 డిగ్రీలు, భద్రాచలం - 36 డిగ్రీలు, దుండిగల్ - 33.6 డిగ్రీలు, హన్మకొండ - 36.5 డిగ్రీలు, హైదరాబాద్ - 35.7 డిగ్రీలు, ఖమ్మం - 37.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్ - 35 డిగ్రీలు, మెదక్ - 34.2 డిగ్రీలు, నల్గొండ - 37 డిగ్రీలు, నిజామాబాద్ - 39 డిగ్రీలు, రామగుండం - 38.6 డిగ్రీలు.

    వివరాలు 

    ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాల ప్రభావం

    ఉపరితల ఆవర్తనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపైనా పడుతోంది.గత కొన్ని రోజులుగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి.

    ముఖ్యంగా రాయలసీమలోని జిల్లాలు,దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలైన కృష్ణా, తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి,గుంటూరు,నెల్లూరు జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి.

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాతావరణ శాఖ

    తాజా

    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు ముంబయి ఇండియన్స్
    Kolkatta: కోల్‌కతాలో డ్రోన్ల కలకలం.. విచారణ చేపట్టిన పోలీసులు కోల్‌కతా
    Amazon: అమెజాన్ డ్రోన్ డెలివరీతో ఒక్క గంటలో ఇంటి వద్దకి ఐఫోన్? అమెజాన్‌

    వాతావరణ శాఖ

    IMD: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ హైదరాబాద్
    Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక భారతదేశం
    IMD : నవంబర్‌లో చలి తక్కువే.. వాతావరణ శాఖ నివేదిక ఆంధ్రప్రదేశ్
    Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025