LOADING...
Revanth Reddy: తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి 
తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను తక్షణమే మోహరించాలని ఆదేశించారు. భారీ వర్షాల సూచనతో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, వాగులు పొంగే ప్రమాదమున్న ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే గుర్తించి సహాయక శిబిరాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, జలాశయాల పరిస్థితిని అధికారులు నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.