LOADING...
Heavy Rains: హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

Heavy Rains: హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా అమీర్‌పేట్‌, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, యూసఫ్‌గూడ, కోఠి, సుల్తాన్ బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, కుత్బుల్లాపూర్‌, చింతల్ సాయినగర్‌, మల్కాజిగిరి, ముషీరాబాద్‌, సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. రహదారులపై నీరు నిలవడం వల్ల వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Details

జిల్లాల  వారీగా వర్షపాతం వివరాలు ఇవే

ములుగు జిల్లా, ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెం.మీ లింగాల (ఖమ్మం) 10 సెం.మీ మొగడంపల్లి (సంగారెడ్డి) 9.8 సెం.మీ పల్లెగూడెం (ఖమ్మం) 8.98 సెం.మీ మేడారం (ములుగు) 8.43 సెం.మీ పుల్కల్ (సంగారెడ్డి) 7.45 సెం.మీ గూడూర్ (జనగామ) 7.38 సెం.మీ వికారాబాద్ జిల్లా, ఖాసింపూర్, బషీరాబాద్ 7 సెం.మీ పెరుమాండ్ల-సంకీస్ (మహబూబాబాద్) 7 సెం.మీ కొండాపూర్ (సంగారెడ్డి) 6.48 సెం.మీ మోమిన్‌పేట్ (వికారాబాద్) 6.35 సెం.మీ కూనారం (పెద్దపల్లి) 6.18 సెం.మీ కాసిందేవిపేట (ములుగు) 8.78 సెం.మీ

Details

తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్

వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బిహార్‌ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో చాలావరకు ప్రాంతాలకు మోస్తరు నుంచి భారీ వర్షం సూచన ఉంది. కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇంతకుముందు ఈశాన్య, వాయవ్య అరేబియా సముద్రంలో శక్తివంతమైన తుపాను కొనసాగుతోంది. ఈ తుపాను ద్వారకాకు తూర్పుగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఒమన్‌లో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వాతావరణ శాఖ తెలిపింది.