
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు.. విమాన రాకపోకలకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచే మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం ప్రారంభమైంది. నగరం అంతటా కారు మేఘాలు కమ్ముకోడంతో చీకటి వాతావరణం ఏర్పడింది. వర్షం వల్ల రహదారులు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లే సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వాహనదారులు కూడా ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు.
వివరాలు
ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ
భారీ వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై కూడా పడింది. కొన్ని విమానాలు ఆలస్యం కావడం, మార్గాలు మారడం వంటి అంశాలపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని విమానయాన సంస్థలు సూచించాయి. వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉండటంతో విమాన కార్యకలాపాల్లో ఆటంకాలు ఎదురవుతాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇదే సమయంలో ఢిల్లీకి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) తూర్పు ప్రాంతాల్లోనూ హెచ్చరికలు జారీయ్యాయి. వచ్చే ఒకటి లేదా రెండు గంటల్లో విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.