LOADING...
Rain Alert: తెలంగాణకు వర్షసూచన.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ
తెలంగాణకు వర్షసూచన.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

Rain Alert: తెలంగాణకు వర్షసూచన.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. హైదరాబాద్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

వివరాలు 

ఈ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం..

ఇదిలా ఉండగా, ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎర్ర హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లాలకు ఎర్ర హెచ్చరిక అమల్లో ఉండగా, రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు కూడా ఎర్ర హెచ్చరిక ప్రకటించారు. అలాగే ఇవాళ, రేపు కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

Advertisement