Page Loader
తెలంగాణ, ఆంధ్ర‌ప్రదేశ్‌‌కు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజుల పాటు వానలు
వచ్చే ఐదు రోజులు జోరు వానలు

తెలంగాణ, ఆంధ్ర‌ప్రదేశ్‌‌కు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజుల పాటు వానలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 24, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో మరో దఫా భారీ వానలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 5 రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురివనున్నాయి. తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌ సహా మేడ్చల్‌, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఈ క్రమంలోనే ఎల్లో, గ్రీన్‌ అలర్ట్ జారీ అయ్యింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐఎండీ చేసిన ట్వీట్