
IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.
ఫలితంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న గంగా నది, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని వల్ల రాబోయే ఐదు రోజుల్లో ఈ ప్రాంతాల్లో భారీ అలాగే విస్తృతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర పేర్కొన్నారు.
ఒడిశాలోని వివిధ జిల్లాల్లో రాబోయే 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
వర్షాలు
తెలంగాణ, ఏపీలో జులై 20వరకు విస్తారంగా వర్షాలు
ఇక దక్షిణ భారతదేశానికి సంబంధించి జులై 21 వరకు కోస్తా కర్ణాటకలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళలో జూలై 20 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
దిల్లీలో సోమవారం తేలికపాటి, , ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ పేర్కొంది.
మేఘాలయ, త్రిపుర, అసోంలో రోబోయే 24గంటలు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఐఎండీ
హిమాచల్ ప్రదేశ్‌ను వీడని వర్షపు ముప్పు
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న హిమాచల్ ప్రదేశ్ మరోసారి రుతుపవనాలు కమ్మేస్తున్నాయి. దీంతో ఇప్పటికే హిమాచల్‌కు వానల నుంచి ఉపశమనం లభించే పరిస్థితి కనిపించడం లేదు.
హిమాచల్ ప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లలో కూడా రాబోయే మూడు రోజుల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.
హర్యానా-చండీగఢ్‌లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో వరదల ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఐఎండీ
గోవా, గుజరాత్, మహారాష్ట్రలో జులై 21వరకు వానలే వానలు
బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
అలాగే రాబోయే రెండు రోజులు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
జులై 18 నుంచి 21 వరకు కొంకణ్, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గుజరాత్, మధ్య మహారాష్ట్రలో కూడా జూలై 21 వరకు ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది.