సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది
సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది
వ్రాసిన వారు
Naveen Stalin
April 04, 2023 | 03:49 pm
సిక్కింలోని నాథు లా పర్వత మార్గంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. అనేక మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. మంచులో చిక్కుకొని చిన్నారి సహా ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మంచులో మరో 150మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పర్వత మార్గంలో రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.