Page Loader
Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల
20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల

Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జునసాగర్ జలాశయంలో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం 2,02,404 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ నీటిని కుడి కాలువకు 6,979, ఎడమ కాలువకు 6,173, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 2,400, లోలెవల్ కెనాల్‌కు 400 ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 28,826 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం, ఎగువనుంచి 2,47,182 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రస్తుత నీటి మట్టం 589.60 అడుగులకు చేరింది.