Page Loader
emergency landing: కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌.. నడిరోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌.. నడిరోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

emergency landing: కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌.. నడిరోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా సమీపంలో కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్‌ శనివారం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. బాదాసు బేస్‌ క్యాంప్‌ నుంచి టేకాఫ్‌ అయిన వెంటనే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. పైలట్‌ అప్రమత్తంగా స్పందిస్తూ హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందికి దించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ అదుపు తప్పి జాతీయ రహదారిపై బలంగా నేలతాకింది.

Details

సాంకేతిక లోపాలపై అధికారులు దర్యాప్తు

ఈ ఘటనలో టెయిల్‌ రోటర్‌ తెగిపడగా, సమీపంలోని కొన్ని భవనాలు, అలాగే రోడ్డుపై పార్క్‌ చేసి ఉంచిన ఓ కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పైలట్‌కు స్వల్ప గాయాలు కాగా, అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం 12.52 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన సాంకేతిక లోపాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.