తదుపరి వార్తా కథనం
Sonusood: ఏపీకి సాయం.. సోనూసూద్‌ను అభినందించిన చంద్రబాబు నాయుడు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 03, 2025
05:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని నటుడు, 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు.
ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ నాలుగు అంబులెన్స్‌లను అందించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్, ఫౌండేషన్ అందించిన అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు.
అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
మర్యాద పూర్వకంగా తనను కలిసిన సోనూసూద్‌ను సీఎం అభినందించారు.
ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు.