Narayanmurthy:'నువ్వు నాలా మారడం నాకు ఇష్టం లేదు'.. 12 ఏళ్ల కుర్రాడితో నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఇటీవల, టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంలో, 12 సంవత్సరాల చిన్నారి ఆయనకు 'మీలా కావాలంటే ఏమి చేయాలి?' అని ప్రశ్నించాడు. దీనికి నారాయణమూర్తి సమాధానంగా,''నువ్వు నాలా కాకుండా, మరింత ఉన్నత స్థాయిలకు చేరాలని ఆశిస్తున్నాను. మీరు నాపై ఆధారపడకుండా, కొత్త మార్గాలు సృష్టించాలని..దేశం కోసం ఉన్నతంగా ఎదగాలని ప్రేరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, నారాయణమూర్తి తన జీవన అనుభవాలను, ముఖ్యమైన పాఠాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఆయన తన విద్యార్థి కాలంలో టైమ్ టేబుల్ తనకు ఎలా సహాయపడిందో, ఆ విధంగా చేసినందువల్ల ఎలా ఉన్నత ర్యాంకులను సాధించడంలో సహాయపడిందో వివరించారు.
బాస్ కోలిన్ తనతో కలిసి..
ఒక విద్యార్థిగా క్రమశిక్షణను అలవాటుగా మార్చుకోవడం ద్వారా జీవితంలోని విజయాలను సాధించవచ్చని చెప్పారు. ఈ క్రమంలో తమ మొదటి రోజుల్లో పారిస్‌లో జరిగిన ఒక సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాజెక్టు సమయంలో వారి కంప్యూటర్ సిస్టమ్ మెమరీ పూర్తిగా పోయిపోయినప్పుడు,ఆయన బాస్ కోలిన్ తనతో కలిసి 22గంటలు పునరుద్ధరణ కోసం పని చేశారని,కానీ ఎప్పుడూ తనను తక్కువ అంచనా వేయలేదు అన్నారు. ఈవిధంగా,విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగాలని,వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. అలాగే,నారాయణమూర్తి తన తల్లి ఇతరులకు సహాయం అందించే ఆనందాన్ని నేర్పిందని చెప్పారు. అవసరమున్న వారికి సమయానుకూలంగా అందించే సహాయం,మనలోని మానవతా దృక్పథాన్ని ప్రదర్శిస్తుందన్నారు. ఈసందర్భంగా,ఆయన విద్యార్థులతో వివిధ విషయాలపై చర్చలు జరిపి,వారి సందేహాలను తీర్చారు.