తదుపరి వార్తా కథనం

Hyderabad: బాంబు బెదిరింపుతో సికింద్రాబాద్ పాఠశాల వద్ద హై అలర్ట్.. ముమ్మరంగా తనిఖీ చేపడుతున్న పోలీసులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 22, 2024
03:21 pm
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్ జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పోలీసుల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలలకు మెయిల్ ద్వారా వచ్చిన బాంబు బెదిరింపు సందేశం నేపథ్యంలో నగరంలోని జవహర్ నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
బాంబ్ స్క్వాడ్‌ను వెంటనే రంగంలోకి దింపి, పాఠశాల ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం అత్యవసర చర్యలు తీసుకొని, విద్యార్థులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించింది.
ఘటనాస్థలికి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీపీ మహేశ్ చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.
భద్రతా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాల పరిసరాల్లో క్షుణ్ణమైన తనిఖీలు చేపట్టారు.