TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్‌కు హైకోర్టు నోటీసులు.. ఆస్తుల అఫిడవిట్‌పై సందేహాలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకే (TVK) అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని షాక్ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో సమర్పించిన అఫిడవిట్లలో అంకెలు సరిపోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైకు చెందిన విఘ్నేష్ అనే పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ తన ఆస్తుల విలువను రూ.115.13 కోట్లుగా ప్రకటించారు. అయితే తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఆస్తుల విలువను రూ.220.15 కోట్లుగా చూపించారు.
వివరాలు
రూ.105 కోట్ల భారీ వ్యత్యాసం
ఈ రెండు అఫిడవిట్ల మధ్య సుమారు రూ.105 కోట్ల భారీ వ్యత్యాసం ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం, ఒక నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా ఆస్తులను వెల్లడించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో విజయ్‌తో పాటు భారత ఎన్నికల సంఘం, ఐటీ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్, సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
వివరాలు
తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా
పోలింగ్ తేదీ అయిన ఏప్రిల్ 23లోపు విచారణ నివేదికను ప్రజలకు వెల్లడించాలని పిటిషనర్ కోరారు. దీని ద్వారా ఓటర్లు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తుల వివరాల దాపరికం నిజమైతే, అది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.